ప్రైస్ ది లార్డ్...
ఈరోజు నిశ్శబ్దంగా కూర్చుని ఒక మాట విన్నాను - "చిన్న వాటి దేవుడు".
నా మనసు వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళింది.
అతని చేతిలో ఐదు చిన్న రాళ్ళు. చిన్నవి. సాదాగా ఉన్నాయి.
కానీ దేవుని చేతిలోకి వెళ్ళగానే... ఒక గొల్యాతు కూలిపోయాడు.
తర్వాత నాకు గుర్తొచ్చింది...
ఒక చిన్న బాలుడు. చేతిలో ఐదు రొట్టెలు.
మన కళ్ళకు చాలవు. కానీ యేసయ్య చేతిలోకి వెళ్ళగానే
ఐదు వేల మంది తిన్నారు. పన్నెండు గంపలు మిగిలాయి.
అర్థమైందా?
*మన చేతిలో చిన్నదిగా కనిపించేది...
ఆయన చేతిలో సమృద్ధిగా మారుతుంది.*
ఈరోజు నీ ప్రార్థన చిన్నదేమో.
నీ భక్తి సాదాగా ఉండొచ్చు.
నీ విధేయత చిన్న స్టెప్ కావచ్చు.
కానీ దాన్ని క్రీస్తు చేతిలో పెడితే... అది వృధా కాదు.
అవును ప్రభువా...
ఈ చిన్న భక్తి కూడా... నీకు ఇస్తే చాలు.
ఆమెన్.

Praise God thank u Jesus for a small thing in your hand it will become a big thing
ReplyDelete